Telugu Global
CRIME

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మ‌ర‌ణం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మ‌ర‌ణం
X

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధిలో ముండన్ వేడుక కోసం మైహర్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న వాహనం భారీ ట్రక్కును అతి వేగంగా వెళ్తున్న కారు.. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  10 March 2025 10:11 AM IST
Next Story