Telugu Global
CRIME

పుప్పాలగూడలో అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

సిలిండర్‌ పేలి ఎగిసిపడుతున్న మంటలు

పుప్పాలగూడలో అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్రమాదం
X

మణికొండ పరిధి పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్‌ ఒరియల్‌ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అపార్టుమెంట్‌ వాసులు బయటకు పరుగులు తీశారు. ఫ్లాట్‌లోని ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనలో ఫ్లాట్‌ పూర్తిగా దగ్ధమైంది. దాచుకున్న డబ్బులు, దుస్తులు, విలువైన సామగ్రి కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఫైర్‌ ఇంజిన్ పోవడానికి దారి లేక గంట పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. సమయానికే వచ్చినా లోనికి పోవడానికి దారిలేక చేతులెత్తేశారు. ప్రస్తుం 3 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అపార్టుమెంట్‌ నిర్మాణం ఉండటంతో నిర్వాహకులపై పోలీసులు సీరియస్‌ అయ్యారు.

First Published:  16 Nov 2024 8:17 AM IST
Next Story