Telugu Global
CRIME

అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

నిందితుల నుంచి 4.7 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు

అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ముఠా అరెస్ట్‌
X

కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.7 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 3.71 కోట్లు ఉంటుందని అంచనా. రోడ్డు మార్గం ద్వారా విదేశీ బంగారాన్ని తీసుకొస్తున్నారన్న సమాచారంతో అధికారులు నగర శివారులోని రాయకల్‌ టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకుని సోదాలు చేశారు. కారు హ్యాండ్‌ బ్రేక్‌ దిగువన ప్రత్యేకంగా తయారుచేసిన క్యావిటీలో బంగారం దాచిపెట్టినట్లు గుర్తించారు. బంగారం తరలిస్తున్న ముగ్గురిపైనా కస్టమ్స్‌ చట్టం 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

First Published:  28 Sept 2024 3:00 PM GMT
Next Story