Telugu Global
CRIME

పేలిన పెట్రోల్‌ ట్యాంకర్‌ ..140 మందికి పైగా మృతి

నైజీరియాలో జరిగిన ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమం

పేలిన పెట్రోల్‌ ట్యాంకర్‌ ..140 మందికి పైగా మృతి
X

నైజీరియాలో పెను విషాదం జరిగింది. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 140 మందికి పైగా మృతి చెందారు. జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నది. కనో నుంచి బయలుదేరిన ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో హైవేపై బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్‌ వద్దకు వెళ్లారు. వారు పెట్రోల్‌ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ ఘటనలో 94 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటంతో ప్రమాదం జరిగిందని, మృతుల సంఖ్య భారీగా ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

First Published:  16 Oct 2024 11:58 PM IST
Next Story