Nikhil Siddhartha Divorce: విడాకుల పుకార్లపై యంగ్ హీరో నిఖిల్ క్లారిటీ
Nikhil Siddhartha Clarity on Divorce Rumors: అయితే ఈ పుకార్లకు తాజాగా నిఖిల్ చెక్ పెట్టాడు. భార్య పల్లవితో గోవాలో వెకేషన్‌లో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిఖిల్ షేర్ చేశాడు. మనిద్దరం కలిసి ఉన్న ప్రతిక్షణం అద్భుతమే అంటూ.. ఒక కామెంట్ కూడా జత చేశాడు.

Nikhil Siddhartha Divorce: విడాకుల పుకార్లపై యంగ్ హీరో నిఖిల్ క్లారిటీ
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో నిఖిల్ కార్తీక్. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో మొదట్లో పరాజయాలు పలకరించినప్పటికీ అవన్నీ ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు. తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా నిఖిల్ 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ప్రస్తుతం పల్లవికి దూరంగా ఉంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పల్లవి నుంచి విడిపోయేందుకు నిఖిల్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే ఈ పుకార్లకు తాజాగా నిఖిల్ చెక్ పెట్టాడు. భార్య పల్లవితో గోవాలో వెకేషన్‌లో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిఖిల్ షేర్ చేశాడు. మనిద్దరం కలిసి ఉన్న ప్రతిక్షణం అద్భుతమే అంటూ.. ఒక కామెంట్ కూడా జత చేశాడు. దీంతో నిఖిల్, పల్లవి మధ్య విభేదాలు వచ్చాయని, వారు విడిపోనున్నారని వచ్చిన వార్తలకు చెక్ పెట్టాడు.
నిఖిల్ హీరోగా నటించిన తాజా సినిమా కార్తికేయ -2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో 18 పేజీస్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత నిఖిల్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.