Telugu Global
Cinema & Entertainment

యష్ పాత సినిమాలకు పెరిగిన డిమాండ్

యష్ హీరోగా నటించిన పాత సినిమాను తెలుగులో రారాజు పేరిట రిలీజ్ చేస్తున్నారు.

యష్ పాత సినిమాలకు పెరిగిన డిమాండ్
X

కేజీఎఫ్ పార్ట్-1, పార్ట్-2 విజయాలతో యష్ పాత సినిమాలకు తెలుగు, హిందీ మార్కెట్ లో డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటికే అతడు నటించిన ఓ పాత సినిమా గజకేశరి పేరిట తెలుగులో రిలీజైంది. ఆ సినిమా హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ భారీ రేటుకు కొనుగోలు కూడా చేసింది. ఇప్పుడు యష్ నుంచి మరో పాత సినిమా, కొత్తగా ముస్తాబై విడుదలకు సిద్ధమైంది.

యష్ హీరోగా నటించిన పాత సినిమా రారాజు. కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ తెలుగు రాష్ట్రాలలో బారీ ఎత్తున అక్టోబర్ 14న రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాలో యష్ సరసన హీరోయిన్ గా, ఆయన భార్య రాధిక పండిట్ నటించింది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ ట్రయిలర్, లిరికల్ సాంగ్స్ విడుదలయ్యాయి. కిక్ శ్యామ్ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

డబ్బింగ్ సినిమా నిర్మాతలకు నాన్-థియేట్రికల్ రైట్స్ ఇప్పుడు వరంగా మారాయి. తమిళ్ లేదా కన్నడ సినిమాను వీలైనంత తక్కువ మొత్తంలో తీసుకొని నామమాత్రంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. తర్వాత శాటిలైట్ రైట్స్ అమ్మేసి, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారు. అలా రెట్టింపు లాభాలు అందుకుంటున్నారు ప్రొడ్యూసర్లు.

First Published:  5 Oct 2022 12:15 PM IST
Next Story