Telugu Global
Cinema & Entertainment

Skanda | మాస్ చూపించి ఫ్యామిలీస్ ను రమ్మంటారేంటి?

Skanda Movie - స్కంద మూవీ మాస్ మూవీ. కానీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటున్నారు. కానీ ట్రయిలర్ లో మాత్రం చూపించడం లేదు.

Skanda | మాస్ చూపించి ఫ్యామిలీస్ ను రమ్మంటారేంటి?
X

తమ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఫస్ట్ లుక్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తారు మేకర్స్. టీజర్ లో జానర్ ను లైట్ గా టచ్ చేస్తారు. ఇక ట్రయిలర్ లో టోటల్ థీమ్ లేదా జానర్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు. తద్వారా ఆ సెక్షన్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ స్కంద విషయంలో చూపించేదొకటి, చెప్పేది ఇంకోటి..!

రామ్ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కింది స్కంద సినిమా. మాస్ కోసం రామ్ ఎంత పరితపిస్తున్నాడో ఇస్మార్ట్ శంకర్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక బోయపాటి అంటేనే మాస్-యాక్షన్. కాబట్టి సహజంగానే స్కంద సినిమా కంప్లీట్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్ అయింది.

ఇదే విషయం టీజర్, ట్రయిలర్ లో కనిపించింది. తాజాగా విడుదల చేసిన 'రిలీజ్ ట్రయిలర్' లో కూడా అదే ఉంది. కాకపోతే మేకర్స్ మాత్రం ఇది ఫ్యామిలీ సినిమా అని పదేపదే చెబుతున్నారు. కుటుంబాలతో కలిసి రావాలని కోరుతున్నారు. రామ్ కూడా అదే అంటున్నాడు.

"స్కంద అనేది మాస్ సినిమా మాత్రమే కాదు. ఇందులో బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఫ్యామిలీ ఎమోషనే ఈ సినిమా ఆత్మ." ఇలా స్కంద సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయని, కుటుంబసమేతంగా థియేటర్లకు రావాలని కోరుతున్నాడు రామ్ పోతినేని.

అయితే ఇక్కడ బేసిక్ డౌట్ ఏంటంటే.. నిజంగా ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నప్పుడు ట్రయిలర్ లో అది చూపించొచ్చు కదా. ఓ డైలాగ్ కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు. కనీసం రిలీజ్ ట్రయిలర్ లోనైనా చూపించి ఉండాల్సింది.

90 సెకెన్ల ట్రయిలర్ లో ఓ 20 సెకెన్లను మీటింగ్ లో ఘనంగా చెబుతున్న ఫ్యామిలీ ఎలిమెంట్స్ కు కేటాయించి ఉంటే, వాళ్లు మాటలకు మరింత బలం చేకూరినట్టయ్యేది. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు.

ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రయిలర్, రిలీజ్ ట్రయిలర్ లో మాస్-యాక్షన్ కే ప్రాధాన్యం ఇచ్చి, స్టేజ్ పై మాత్రం ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి, కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానిస్తున్నారు. కేవలం కరీంనగర్ లో జరిగిన ఈవెంట్ లోనే కాదు, ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రచార కార్యక్రమంలో ఇదే మాట వినిపిస్తోంది. ఇదేం స్ట్రాటజీనో 'రామ్-బోయ'కే తెలియాలి.

First Published:  26 Sept 2023 11:08 PM IST
Next Story