Telugu Global
Cinema & Entertainment

Janhvi Kapoor | జాన్వి కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందా..?

Janhvi Kapoor | ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి పొజిషన్ లో ఉంది జాన్వి కపూర్. ఇలాంటి టైమ్ లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందంట ఈ బ్యూటీ.

Janhvi Kapoor | జాన్వి కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందా..?
X

జాన్వీ కపూర్... ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో లీడింగ్ హీరోయిన్. శ్రీదేవి కూతురిగా, అందాల రాశిగా ఈమెకు మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ సడెన్ గా పెళ్లి పుకార్లతో హాట్ టాపిక్ గా మారింది.

జాన్వి కపూర్ కు ఓ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడి పేరు శిఖర్ పహారియా. అతడ్ని జాన్వి, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ పుకార్లు మొదలయ్యాయి. దీనికి కారణం, ఇద్దరూ కలిసి దేవాలయాలు సందర్శించడమే. తాజాగా ఇద్దరూ కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఇద్దరూ కలిసి కొన్ని ప్రత్యేక పూజలు చేశారు.

సాధారణంగా ప్రముఖులు పెళ్లి చేసుకునేముందు ఇలా ఆలయాలు సందర్శించడం, ప్రత్యేక పూజలు చేయడం మనం చూశాం. ఇప్పుడు జాన్వి కూడా అదే చేస్తోంది. అదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. పెళ్లి చేసుకోకపోతే, ఇలా జంటగా పూజలు చేయాల్సిన అవసరం లేదు కదా అనేది అందరి ప్రశ్న.

ప్రస్తుతం జాన్వి కపూర్ వయసు 26 సంవత్సరాలు. ఏ హీరోయిన్ అయినా ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పైగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో పెళ్లి గురించి అస్సలు ఆలోచించరు. కానీ ఈమధ్య హీరోయిన్ల మైండ్ సెట్ మారింది. పెళ్లి చేసుకొని కూడా కెరీర్ కొనసాగించొచ్చని కియరా అద్వానీ లాంటి వాళ్లు నిరూపిస్తున్నారు. జాన్వి కూడా అదే పద్ధతి ఫాలో అవుతుందేమో.

First Published:  6 Dec 2023 8:01 PM IST
Next Story