Telugu Global
Cinema & Entertainment

Allari Naresh | అల్లరి నరేష్ ఈసారైనా హిట్ కొడతాడా?

Allari Naresh - ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఫ్లాప్ ఇచ్చాడు అల్లరి నరేష్. ఇప్పుడు మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. కనీసం ఈసారైనా హిట్ కొడతాడా?

Allari Naresh | అల్లరి నరేష్ ఈసారైనా హిట్ కొడతాడా?
X

హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి'లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో కనిపించాడు. సీరియస్ లుక్ లో రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాణసంచా కాల్చడం, జాతర సెటప్ చూడొచ్చు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న బచ్చల మల్లి కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

సీతా రామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, రిచర్డ్ ఎం నాథన్ డివోపీగా పని చేస్తున్నారు. ఈ సినిమాను డైరక్ట్ చేయడంతో పాటు.. కథ-మాటలు కూడా అందించాడు సుబ్బు. 1990 బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో షూటింగ్ జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు అల్లరి నరేష్. దీంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. బచ్చల మల్లి సినిమాతో అతడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First Published:  31 May 2024 10:25 PM IST
Next Story