Adipurush Box Office Collections: ఆదిపురుష్ మొదటి రోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?
Adipurush Box Office Collection Day 1: ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్. మొదటి రోజు ఈ సినిమా వంద కోట్లు రాబడుతుందా?

Adipurush Box Office Collections: మొదటి రోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?
Adipurush Box Office Collections: ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ (Adipurush). ఓం రౌత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రామాయణంకు హైటెక్ గ్రాఫిక్స్ అద్ది తీసిన భారీ బడ్జెట్ సినిమా ఇది. దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మరి ఇంత ఖర్చుతో తీసిన ఈ సినిమాకు మొదటి రోజు ఎంత వస్తుంది?
ట్రేడ్ అంచనా ప్రకారం, ఆదిపురుష్ సినిమాకు మొదటి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందట. ఈ మేరకు వాళ్లు చెబుతున్న లెక్కలు కూడా సహేతుకంగానే కనిపిస్తున్నాయి. నార్త్ బెల్ట్ లో ఆదిపురుష్ సినిమాకు 25 కోట్ల రూపాయలు వస్తాయంట. ఇది నమ్మొచ్చు, ఎందుకంటే, అక్కడ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగింది.
ఇక సౌత్ లో ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందంటున్నారు. ఇది కూడా నమ్మొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచే ఆదిపురుష్ సినిమాకు మొదటి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్ అంచనా వేస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్లు కలిపి మరో 40 కోట్లు గ్రాస్ చేయడం పెద్ద సమస్య కాదు.
అలా ఈ సినిమా ఈజీగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తుందని చెబుతోంది ట్రేడ్. అయితే దీనికి ఓవర్సీస్ వసూళ్లు అదనం. యూఎస్ఏలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.
సో.. ఎలా చూసుకున్నా మొదటి రోజు ఆదిపురుష్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అంటున్నారు. ఈ అంచనా నిజం అవుతుందా, అవ్వదా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.