Hanu-Man | హను-మాన్ కోసం తేజ సజ్జానే ఎందుకు తీసుకున్నారు?
Hanu-Man - హనుమాన్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. సూపర్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ సినిమాలోకి తేజ సజ్జానే ఎందుకు తీసుకున్నారు?
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడాడు.
"పర్శనల్ గా తేజని అందరూ ఇష్టపడతారు. సినిమాల్లో తనకి ఇంకా మాస్ ఇమేజ్ రాలేదు. ఇందులో పాత్రకు ఇలాంటి నటుడే కావాలి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తనకి సూపర్ పవర్స్ రావాలని అనుకున్నప్పుడు ఆ పవర్స్ వస్తాయి. ఎమోషన్ ప్రేక్షకుల నుంచి రూట్ అవుతుంది కాబట్టి అది చాలా సహజంగా ఉంటుంది."
హనుమాన్ సినిమాను సూపర్ హీరో ఫిల్మ్ టెంప్లెట్ లోనే తీశానని తెలిపిన ప్రశాంత్ వర్మ.. తెలుగు సినిమా స్టయిల్ అఫ్ మేకింగ్ లో తీయడమే ఈ సినిమాలో కొత్తదనం అని చెబుతున్నాడు. బ్యాట్ మ్యాన్ లాంటి సినిమాని రాజమౌళి చేస్తే ఎలా ఉంటుందో, హనుమాన్ అలా ఉంటుందని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే, కేజీఎఫ్ లో యష్ ని ఎలా చూపించారో హనుమంతుని తను అలా చూపించానంటున్నాడు.