Varalaxmi Sarathkumar | వరలక్ష్మి హీరోయిన్ పాత్రలు ఎందుకు చేయదు?
Varalaxmi Sarathkumar - వరలక్ష్మి ఎందుకు హీరోయిన్ పాత్రలు చేయదు? దీనికి ఆమె ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

మంచి హైట్ ఉంది. ఎత్తుకు తగ్గ అందం ఉంది. యాక్టింగ్ టాలెంట్ ఉంది. అన్నింటికీ మించి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ హీరోయిన్ పాత్రలు మాత్రం చేయనంటోంది వరలక్ష్మి. దీనికి కారణం ఏంటి?
"నటనలో ఎప్పుడూ హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ అని చూడను. మొదటి నుంచి ఈ అలవాటు లేదు. వీరసింహారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. అది నాకు ముఖ్యం. కథలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అనేదే చూసుకుంటాను. కొంతమందికి నా పేరు తెలీదు. వాళ్ళు నన్ను జయమ్మ, భానుమతి అని పిలుస్తారు. ఇదే నాకు అసలైన అవార్డ్."
ఇలా తన ఆలోచన విధానాన్ని బయటపెట్టింది వరలక్ష్మి. గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ కంటే, మంచి నటి అనిపించుకోవడం తనకు ఇష్టమని అంటోంది.
"ప్రేక్షకులు కచ్చితంగా నన్ను ఇష్టపడతారు. నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే పేరు వచ్చింది. ఆ పేరుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. హను-మాన్ లో చేస్తున్న అంజమ్మ పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది."
ఇలా విభిన్న పాత్రలు మాత్రమే పోషిస్తాననే విషయాన్ని వెల్లడించింది వరలక్ష్మి. ఓవైపు పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, మరోవైపు లీడ్ రోల్స్ కూడా చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా వచ్చిన కోటబొమ్మాళి పీఎస్ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.