హీరో వెంకటేష్, రానా పై కేసు నమోదు ఎందుకంటే?
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో సినీ నటులు వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ సిటీ సివిల్ కోర్టు వెళ్లారు. దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని నాంపల్లిలోని 17వ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి ఫ్యామిలీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో గత కొంత కాలం క్రితం దగ్గుబాటి కుటుంబానికి, నంద కుమార్ కు మధ్య వివాదం నెలకొంది. తాను లీజుకు తీసుకున్న దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చి వేశారని నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా వేయగా.. ఈ రోజు విచారణకు రావడంతో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.
కోర్టు తీర్పుతో దగ్గుబాటి కుటుంబంలోని హీరో వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబు లపై 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే విచారణ చేపట్టునున్నట్లు తెలుస్తుంది. 2022 నవంబరులో జిహెచ్ ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా.. 2024 జనవరిలో హోటల్‌ను దగ్గుబాటి ఫ్యామిలీ పూర్తిగా కూల్చి వేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.