Varun Tej - నిశ్చితార్థం గాసిప్స్ ఖండించని వరుణ్
Varun Tej engagement - వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంపై చాలా గాసిప్స్ వస్తున్నాయి. అయితే వాటిని వరుణ్ తేజ్ ఖండించడం లేదు.

Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి డేటింగ్ రూమర్స్ కొత్తవేం కావు. దాదాపు ఏడాదిగా వీళ్లిద్దరిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. గతంలో తమపై పుకార్లు వచ్చిన ప్రతిసారి ఈ జంట ఖండించింది. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి మాత్రం వీళ్లు ఈ గాసిప్స్ ను ఖండించడం లేదు.
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారట. అంతేకాదు, 9వ తేదీన వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరగబోతోందంటూ ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారంపై మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి ఖండన ప్రకటన రాకపోవడం విశేషం.
ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూనే, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఓవైపు ప్రవీణ్ సత్తారు సినిమా కోసం విదేశాల్లో షూటింగ్ లో ఉన్న టైమ్ లోనే ఈ 'నిశ్చితార్థం గాసిప్స్' వచ్చాయి.
ఇప్పుడు వరుణ్ తేజ్ ఇండియాలోనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఈ ఊహాగానాల్ని ఖండించలేదు. నిజంగా వీళ్లు ప్రేమించుకుంటున్నారా? ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారా? ఈ వివరాలు తెలియాలంటే, ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం 9వ తేదీ వరకు ఆగాల్సిందే.