Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆత్మహత్య యత్నం ఎందుకు చేశారు ? అతన్ని ఎవరు రక్షించారు?
Why did Pawan Kalyan attempt suicide?: ''ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అన్నయ్య (చిరంజీవి) లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో నా ప్రాణం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. ”అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
''డిప్రెషన్‌తో నేను చాలా పోరాటం చేశాను. ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను”అని టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్‌బికె’ రాబోయే ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ ఈ విషయాలు చెప్పారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ముగింపు ఇంటర్వ్యూ ఫిబ్రవరి 10న తెలుగు OTT ప్లాట్‌ఫారమ్‌లో రాబోతుంది.
నందమూరి బాలకృష్ణతో సంభాషణలో పవన్ కళ్యాణ్ తన యవ్వనంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన క్షణంతో సహా నిరాశతో తను చేసిన యుద్ధాలను వివరించారు.
“నాకు ఉబ్బసం ఉంది. తరచుగా ఆసుపత్రిలో చేరడం వల్ల ఒంటరిగా ఫీలయ్యేవాణ్ణి. నేను సోషల్ పర్సన్ ను కాను. 17 ఏళ్ళ వయసులో, పరీక్షల ఒత్తిడి నా డిప్రెషన్‌ను మరింత పెంచింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అన్నయ్య (చిరంజీవి) లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో నా ప్రాణం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. ”అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
అయితే మరో అన్నయ్య (నాగబాబు), మా వదిన (సురేఖ) లు సమయానికి చూసి నన్ను రక్షించారు. ఆ తర్వాత నా సోదరుడు చిరంజీవి 'నా కోసం జీవించు' అని నాతో చెప్పాడు. ''నీవు ఏమీ చేయకపోతే చేయకు. కానీ దయచేసి జీవించు.’' అని చిరంజీవి అన్నారని చెప్పారు పవన్. ''అప్పటి నుండి, నేను పుస్తకాలు చదవడం, కర్ణాటక సంగీతం, మార్షల్ ఆర్ట్స్, ఇతర సాధనలను అభ్యసించడంలో ఓదార్పుపొందాను. ”అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవద్దు. మీతో మాత్రమే పోటీపడండి, ”అని పవన్ కళ్యాణ్ అన్నారు: “జ్ఞానం, విజయం కష్టపడితే వస్తాయి, ఈ రోజు మనం భరించే కష్టం మన రేపటిని రూపొందిస్తుంది.” అని పవన్ కళ్యాణ్ అన్నారు.