రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసిన మంచు మనోజ్ ఎందుకంటే?
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిను కలిశారు.
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిను కలిశారు. గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదలతో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సమయంలో మరోసారి మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరోకరు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అయితే మనోజ్‌పై తన తండ్రి మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హజరయ్యాడు మనోజ్. ఈ విచారణలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల గురించి మనోజ్ వివరించాడు.
తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు ఇటీవల మేజిస్ట్రేట్‌ను అశ్రయించారు. జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మంచు మనోజ్ తాజాగా కలెక్టర్‌ను కలిసినట్లుగా తెలుస్తోంది.