Telugu Global
Cinema & Entertainment

బింబిసారకు ఎందుకు అంతమంది సంగీత దర్శకులు?

బింబిసార సినిమాకు కీరవాణి మాత్రమే సంగీత దర్శకుడు కాదు. ఎందుకిలా ఇంతమందిని తీసుకున్నారు?

Bimbisara Movie Review and Rating
X

బింబిసార మూవీ రివ్యూ

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మాత్రం కష్టం. ఒక్కో అంశంలో ఒక్కో సంగీత దర్శకుడు కనిపిస్తున్నాడు. ఎందుకిలా? బింబిసారకు ఇంతమంది సంగీత దర్శకులు పనిచేయాల్సిన అవసరం ఏంటి?

"బింబిసార సినిమా అనుకోగానే కీర‌వాణి గారినే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అనుకున్నాం. అయితే అప్ప‌టికే ఆయ‌న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయ‌న్ని అప్రోచ్ కూడా కాలేదు. అప్పుడు చిరంత‌న్ భ‌ట్ గారిని అనుకున్నాం. ఎందుకంటే అప్ప‌టికే ఆయ‌న ఈ టైప్ ఆఫ్ మూవీ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిని చేసున్నారు. ఆయ‌న్ని క‌లిసి క‌థ చెప్పిన త‌ర్వాత క‌ర్మ సాంగ్‌ను ఇచ్చారు. త‌ర్వాత మ‌రో సాంగ్‌ను ఇచ్చారు. మూడో సాంగ్‌ను వ‌రికుప్ప‌ల యాద‌గిరి ఇచ్చారు. ఫోక్ సాంగ్ కావాలి. కానీ.. రొటీన్ ఫోక్ కాకూడ‌ద‌నిపించి.. వ‌రికుప్ప‌ల యాద‌గిరికి విష‌యం చెబితే ఆయ‌నే ట్యూన్ కంపోజ్ చేశారు. త‌ర్వాత టీజ‌ర్‌కి సంతోష్ నారాయ‌ణ్‌గారు మ్యూజిక్ అందించారు. త‌ర్వాత ఆయ‌న బిజీగా ఉండ‌టంతో కీర‌వాణిగారిని క‌లిశాం. ఆయ‌న సినిమా చూసి ఏమంటారోన‌ని కాస్త ఆలోచించాం. కానీ ఆయ‌న సినిమా చూసి వ‌ర్క్ చేస్తాన‌ని చెప్పారు."

ఇలా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లనే ఎక్కువమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు బింబిసార దర్శకుడు వశిష్ఠ. ఈమధ్య పాన్ ఇండియా సినిమాల కోసం ఇద్దరి కంటే ఎక్కువ మంది సంగీత దర్శకులు ఒకే సినిమాకు పనిచేయడం ఆనవాయితీగా మారింది. బింబిసార కోసం అలాంటి ఆనవాయితీ పాటించాలని అనుకోలేదని, అనుకోకుండా అలా జరిగిపోయిందని అంటున్నాడు ఈ దర్శకుడు.

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు వశిష్ట. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో క్యాథరీన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్నాడు బింబిసారుడు.

First Published:  3 Aug 2022 12:30 PM IST
Next Story