Telugu Global
Cinema & Entertainment

'వేట్టయన్‌' మొదటిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

కోలీవుడ్‌లో ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించి రెండో మూవీగా రికార్డు

వేట్టయన్‌ మొదటిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?
X

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా టి.జె.జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ 'వేట్టయన్‌' భారీ అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటలతో పాటు రజనీ యాక్షన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. రజనీ స్టైల్‌ అభిమానులను అలరిస్తున్నది. తమ అభిమాన హీరోను జ్ఞానవేల్‌ బెస్ట్‌గా చూపించారని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్లలోనూ రికార్డు సృష్టించింది. కోలీవుడ్‌లో ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 60 కోట్ల (గ్రాస్‌) వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన విజయ్‌ 'ది గోట్‌' కలెక్షన్లలో కోలీవుడ్‌లో మొదటి స్థానంలో నిలువగా 'వేట్టయన్‌' సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది.

ఎప్పటికీ ఒక్కరే తలైవా

వేట్టయన్‌ అద్భుత విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ సంతోషం వ్యక్తం చేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉన్నది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. 'వేట్టయన్‌' కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

కథ ఏమిటంటే?

అథియాన్‌ (రజనీకాంత్‌) ఒక ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌. నిజాయితీతో పాటు ధైర్యం ఎక్కువ. న్యాయం కోసం చట్టాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం సంకోచించడు. అలాంటి అధికారిని శరణ్య (దుశారా విజయన్‌) అనే స్కూల్‌ టీచర్‌ హత్య కలిచివేస్తుంది. ఆ హత్య చేసిన నిందుతుడు తప్పించకుంటాడు. దీంతో ప్రభుత్వం, పోలీసు అధికారులైనా ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అథియాన్‌ రంగంలోకి దిగుతాడు. కేసు బాధ్యతలను ఆయన తీసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే హంతకుడిని హతమారుస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్‌ (అమితాబ్‌ బచ్చన్‌) ఈ ఎన్‌కౌంటర్‌ను ఎందుకు తప్పుపట్టాడు? అథియాన్‌కు ఆ కేసును మళ్లీ పరిశోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు శరణ్య హత్య వెనుక ఎవరున్నారు? అథియాన్‌కు, ప్యాట్రిక్‌ అలియాస్‌ బ్యాటరీ (ఫహాద్‌ ఫాజిల్‌) నటరాజ్‌ (రానా దగ్గుబాటి)కి సంబంధం ఏమిటి తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

First Published:  11 Oct 2024 10:47 AM IST
Next Story