Telugu Global
Cinema & Entertainment

Geethika - తేజ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja's Heroine Geethika - అహింసతో హీరోయిన్ గా పరిచయమౌతోంది గీతిక. ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Geethika - తేజ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
X

కాజల్.. దర్శకుడు తేజ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయింది. సదా కూడా అంతే. మరో హీరోయిన్ రీమా సేన్ కూడా తేజ స్కూల్ నుంచే వచ్చింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి గీతికపై పడింది. ఇంతకీ ఎవరీ గీతిక.

తేజ డైరక్ట్ చేసిన అహింస సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది గీతిక. ఈమెది మధ్యప్రదేశ్ లోని జబల్పూర్. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, సినిమాల్లోకి వచ్చే ఉద్దేశంతో మోడలింగ్ స్టార్ట్ చేసింది. 2-3 యాడ్స్ కూడా చేసింది.

తన సినిమా కోసం ఎప్పట్లానే ఆడిషన్స్ ప్రకటించాడు తేజ. పలు యాడ్ ఏజెన్సీల నుంచి అమ్మాయిల ఫొటోలు తీసుకున్నాడు. ఆ విషయం గీతికకు తెలిసింది. తనే స్వయంగా తేజ టీమ్ ను సంప్రదించింది. గీతిక లుక్స్ కు తేజ ఫిదా అయ్యాడు. అహింసలో అహల్య పాత్రకు ఆమె సూట్ అవుతుందని భావించాడు, వెంటనే తీసుకున్నాడు.

అలా తొలి ప్రయత్నంలోనే తేజ కళ్లలో పడిన ఈ బ్యూటీ.. తెలుగులో తను కచ్చితంగా క్లిక్ అవుతానంటోంది. తనకు టాలీవుడ్ అంటే ఇష్టమని, స్టార్ హీరోల తెలుగు సినిమాల్ని, హిందీ డబ్బింగ్ వెర్షన్లలో చాలా చూశానని అంటోంది. వచ్చేనెల 2న థియేటర్లలోకి వస్తోంది అహింస మూవీ.

First Published:  25 May 2023 2:50 PM IST
Next Story