చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ పై సుస్మిత ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవికి ప్రధానమంత్రి మోడీ రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేశారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా చిరంజీవి కుమార్తె సుస్మిత స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవికి ప్రధానమంత్రి మోడీ రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేశారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా చిరంజీవి కుమార్తె సుస్మిత స్పందించారు. తన తండ్రికి ప్రధాని మోడీ రాజ్యసభ ఆఫర్ చేసిన విషయం గురించి తనకేమీ తెలియదని చెప్పారు. సుస్మిత నిర్మాతగా మారి పరువు అనే వెబ్ సిరీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. చిరంజీవికి ప్రధాని మోడీ రాజ్యసభ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని..దీనిపై క్లారిటీ ఇవ్వాలని మీడియా ప్రతినిధులు సుస్మితను ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సుస్మిత మాట్లాడుతూ.. తన పరిధిలో లేని అంశాల గురించి అడుగుతున్నారని అన్నారు. తన తండ్రి చిరంజీవికి రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు వచ్చిన రూమర్స్ తమ దాక వచ్చాయని చెప్పారు. దీని గురించి ఇంట్లో డిస్కషన్ కూడా జరిగినట్లు తెలిపారు. రెండు రోజుల కిందట తన బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి స్వీకారం చేశారని.. ప్రస్తుతం తమ కుటుంబం ఆ సెలబ్రేషన్ మూడ్ లోనే ఉందని సుస్మిత స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రధానిని వెంట తీసుకుని తన సోదరుడు చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోడీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరి చేతులను పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని మోడీ చిరంజీవితో సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ఆయనకు ప్రధాని రాజ్యసభ పదవి ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది.