Telugu Global
Cinema & Entertainment

కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత ఏమన్నారంటే ?

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నటి సమంత స్పందించారు. నేను ఎప్పుడు రాజకీయలకు దూరంగా ఉంటా. మా విడాకులు పాలిటిక్స్‌తో సంబంధం లేదని సమంత ట్వీట్ చేశారు

కొండా సురేఖ వ్యాఖ్యలపై  సమంత ఏమన్నారంటే ?
X

తన డివోర్స్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నటి సమంత స్పందించారు. నేను ఎప్పుడు రాజకీయలకు దూరంగా ఉంటా. మా విడాకులు పాలిటిక్స్‌తో సంబంధం లేదు. ఇద్దరి అంగీకారంతోనే డేవర్స్ తీసుకున్నాం మీ రాజకీయం కోసం నన్ను లాగకండి అని ట్వీట్ చేశారు. మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పని చేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు. ఇక విడాకులనేవి నా పూర్తిగా నా పర్సనల్ విషయం అని సామ్ ట్వీట్ చేశారు.ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి.

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ కేబినెట్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలకు నేను షాక్ అయ్యాను. నేను ఆమె ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నాను. నేను ఎంతో గౌరవించే మీరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, సినీ ఇండస్ట్రీలోని మహిళలపై ఆమె చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించాలని కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతుంది. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా మంత్రి కొండా సురేఖ చేసిన అర్థం పర్థంలేని కామెంట్స్‌ని ఖండించాల్సిందిగా సినీ రచయిత కోన వెంకట్ కోరుతున్నాను

First Published:  2 Oct 2024 9:05 PM IST
Next Story