Telugu Global
Cinema & Entertainment

This weekend movie releases Telugu | ఈవారం కూడా 6 సినిమాలు

This weekend movie releases Telugu | ఎప్పట్లానే ఈవారం కూడా 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బేబి, మహావీరుడు సినిమాలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి

This weekend movie releases Telugu | ఈవారం కూడా 6 సినిమాలు
X

This weekend movie releases Telugu | ఈవారం కూడా 6 సినిమాలు

This weekend movie releases Telugu | ప్రతి వారం అరడజనుకు తగ్గకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవారం కూడా 6 సినిమాలొస్తున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. అందులో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా ఒకే ఒక్కటి.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా బేబి. సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. పాటలు హిట్టవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తున్నారు. సినిమా కంటెంట్ పై నమ్మకంతో ఇవాళ్టి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ స్టార్ట్ చేశారు.




బేబీకి పోటీగా వస్తోంది మహావీరుడు సినిమా. శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా ఇది. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఈ హీరో తాజాగా నటించిన ప్రిన్స్ అనే సినిమా ఫెయిలైంది. అది హిట్టయితే, ఈ మహావీరుడుకు మంచి బజ్ వచ్చి ఉండేది.




ఈ వీకెండ్ ఈ రెండు సినిమాలపైన మాత్రమే ఓ మోస్తరు అంచనాలున్నాయి. లిస్ట్ లో బోగన్, రివెంజ్, భారతీయన్స్, నాయకుడు అనే మరో 4 సినిమాలున్నాయి. వీటిలో నాయకుడు సినిమా కొంచెం ఆకర్షిస్తోంది. ఎందుకుంటే, తమిళనాట ఇది హిట్టయింది. పైగా రెహ్మాన్ మ్యూజిక్. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ ఖాళీగా ఉంది. రంగబలి ఫ్లాప్ అయింది. సామజవరగమన రన్ దాదాపు ముగిసింది. ఇలాంటి టైమ్ లో వస్తున్న ఈ 6 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  13 July 2023 4:22 AM GMT
Next Story