Telugu Global
Cinema & Entertainment

Weekend Review | వీకెండ్ బాక్సాఫీస్

Weekend Box Office - మరో వీకెండ్ ముగిసింది. ఒక్క సినిమా కూడా క్లిక్ అవ్వలేదు. బాక్సాఫీస్ డ్రై గా మారింది.

Weekend Review | వీకెండ్ బాక్సాఫీస్
X

గడిచిన వారాంతం దాదాపు 10 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వీటిలో శివం భజే, బడ్డీ, తిరగబడరా సామి, అలనాటి రామచంద్రుడు వంటి ప్రముఖ చిత్రాలున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాల్లో దేనికీ సరైన ఓపెనింగ్స్ రాలేదు.

అశ్విన్ బాబు నటించిన “శివం భజే”పై మొదటి నుండి అంచనాల్లేవు. దానికి తగ్గట్టే సమీక్షల్లో నెగెటివ్ మార్కులు పడ్డాయి. మరోవైపు, అల్లు శిరీష్ నటించిన “బడ్డీ” చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. ఇది అల్లు అర్జున్ అభిమానులను కూడా ఆకర్షించలేకపోయింది. భారీ మార్కెటింగ్, మంచి ట్రైలర్స్ కారణంగా, శివంభజే, బడ్డీ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని చాలా మంది అంచనా వేశారు. పైగా బడ్డీకి టికెట్ రేట్లు కూడా తగ్గించారు. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాల్ని పట్టించుకోలేదు.

మరోవైపు, వివాదాస్పద జంట రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నటించిన “తిరగబడరా సామి” ఘోరంగా విఫలమైంది. వివాదాల కారణంగా ఈ జంట పేర్లు వార్తల్లో నలిగినప్పటికీ, వివాదాన్ని పట్టించుకున్నంతగా సినిమాను జనం పట్టించుకోలేదు.

“అలనాటి రామచంద్రుడు” అనే చిన్న సినిమాకు చాలామంది రివ్యూలు కూడా రాయడానికి ఇష్టపడలేదు. ఓవరాల్‌గా తెలుగు చిత్ర పరిశ్రమ మరో పేలవమైన వారాంతాన్ని చవిచూసింది.

First Published:  6 Aug 2024 9:19 PM IST
Next Story