Telugu Global
Cinema & Entertainment

తమిళ్ రాకర్స్ పై వెబ్ సిరీస్.. వారంలో విడుదల

పైరసీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు తమిళ రాకర్స్. ఇప్పుడీ పైరసీ సైట్ పై వెబ్ సిరీస్ తెరకెక్కింది.

తమిళ్ రాకర్స్ పై వెబ్ సిరీస్.. వారంలో విడుదల
X

సినిమా విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తూ దక్షిణాది చిత్రాలను, సినీ పరిశ్రమల్ని దెబ్బతీస్తోంది "తమిళ్ రాకర్స్". ఈ పైరసీ సైట్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది అనే నేపథ్యంతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. దీని పేరు కూడా తమిల్ రాకర్స్.

ఈ సినిమాలో తమిళ హీరో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. వాణి భోజన్ హీరోయిన్. అరుణ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు

అరివఝగన్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించాడు. సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.

ప్రతి వారం సినిమాల్ని పైరసీ చేస్తూ, దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ కు కూడా ప్రమాదకరంగా తయారయ్యారు తమిళ్ రాకర్స్. వీళ్లు ఎలా పనిచేస్తున్నారు అనే అంశాన్ని కథగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. వాళ్లు సినిమాలను

ఎలా ఫిల్మింగ్ చేస్తారు.. ఎలా అప్ లోడ్ చేస్తారు.. వీళ్లు ఇలా కొత్త సినిమాలను వెబ్ సైట్ లో పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు.. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది... లాంటి అనేక ప్రశ్నలకు ఈ వెబ్ సిరీస్ సమాధానం.

"ఒక సినిమా మేకింగ్ లో ఎంత శ్రమ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ కష్టం ఇలా పైరసీ వల్ల దోపిడీకి గురవుతోంది. వీళ్లను పట్టించడం ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే రెండోది ప్రేక్షకులు ఎవరూ పైరసీ సినిమాలు చూడకుండా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే తమిళ్ రాకర్స్ లాంటి వెబ్ సైట్స్ పతనం అవుతాయి." అంటున్నాడు హీరో అరుణ్ విజయ్. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ కూడా తమిళ్ రాకర్స్ లో పైరసీ అవ్వడం ఖాయం.

First Published:  12 Aug 2022 7:20 PM IST
Next Story