Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు

Waltair Veerayya First Week Box Office Collections: చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. క్లీన్ హిట్ అనిపించుకుంది.

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు
X

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు

Waltair Veerayya Movie Collections: సంక్రాంతి సినిమాలొచ్చి వారం రోజులైంది. ఈవారం రోజుల్లో ఏ సినిమా ఏంటనేది తేలిపోయింది. సంక్రాంతి విజేత ఎవరనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ ఇయర్ సంక్రాంతి విజేతగా వాల్తేరు వీరయ్య సినిమా నిలిచింది. వీరసింహారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చిరంజీవి తన స్టార్ పవర్ చూపించారు. సంక్రాంతి విజేతగా నిలిచారు.

బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 7 రోజుల్లో వాల్తేరు వీరయ్య సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 79 కోట్ల 86 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తాజా వసూళ్లతో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాతో తొలిసారి పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, భారీ లాభాలు కళ్లజూస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమాకు ఓవర్ ఫ్లోస్ ప్రారంభం కాబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 25.92 కోట్లు

సీడెడ్ - 14.61

ఉత్తరాంధ్ర - 11.34

ఈస్ట్ - 8.25

వెస్ట్ - 4.61

గుంటూరు - 6.20

కృష్ణా 5.92

నెల్లూరు - 3.01

First Published:  20 Jan 2023 9:26 PM IST
Next Story