Waltair Veerayya Box Office Collections: వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్
Waltair Veerayya Box Office Collections: చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మొదటి రోజు ఈ సినిమా దుమ్ము రేపింది

Waltair Veerayya | బుల్లితెరపై ఆకట్టుకోలేకపోయిన మెగాస్టార్
వాల్తేరు వీరయ్య దుమ్ముదులిపాడు. మొదటి రోజు అదరగొట్టాడు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా కళ్లుచెదిరే కలెక్షన్లు రాబట్టింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్ లో ఏకంగా 9 లక్షల డాలర్లు వసూళ్లు చేసింది. దీంతో రెండో రోజుకే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది ఈ సినిమా.
వాల్తేరు వీరయ్య సినిమా కంటే ముందు వీరసింహారెడ్డి సినిమా రిలీజైంది. మ్యాగ్జిమమ్ స్క్రీన్స్ దాటికే కేటాయించారు. అయినప్పటికీ, ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య కోసం రెండో రోజు వీరసింహారెడ్డికి స్క్రీన్స్ తగ్గించేశారు. ఫలితంగా చిరు సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కగా, రెండో రోజు వీరసింహారెడ్డి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వాల్తేరు వీరయ్యకు కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. ఏపీ,నైజాం నుంచి ఈ సినిమాకు మొదటి రోజు 36 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఒక్క నైజాం నుంచి మొదటి రోజు 6 కోట్ల రూపాయల షేర్ రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 630కి పైగా స్క్రీన్స్ దక్కాయి.
బాబి దర్శకత్వంలో తెరకెక్కింది వాల్తేరు వీరయ్య సినిమా. సినిమా రొటీన్ గానే ఉన్నప్పటికీ ఇంటర్వెల్ ఎపిసోడ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కారణంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.