Telugu Global
Cinema & Entertainment

VV Vinayak | విశ్వంభర సెట్స్ లో వినాయక్

VV Vinayak Vishwambhara - చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా సెట్స్ లో వీవీ వినాయక్ ప్రత్యక్షమయ్యారు.

VV Vinayak | విశ్వంభర సెట్స్ లో వినాయక్
X

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సినిమా 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. చిరంజీవి కెరీర్ లోనే పెద్ద సినిమా ఇది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన భారీ సెట్ లో షూట్ జరుగుతోంది. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ 'విశ్వంభర' సెట్స్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారు. చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ వశిష్ట కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, వినాయక్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ నెల రోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వీవీ వినాయక్ పై పుకార్లు చెలరేగాయి. ఆ టైమ్ లో అతడి తమ్ముడు వివరణ ఇచ్చాడు. మే 31న వీవీ వినాయక్ కూడా వీడియో రిలీజ్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన పబ్లిక్ లోకి వచ్చారు. తను ఆరోగ్యంగానే ఉన్నానంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

విశ్వంభరలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

First Published:  24 Jun 2024 5:19 PM GMT
Next Story