Telugu Global
Cinema & Entertainment

VV Vinayak - బెల్లంకొండపై భారీ ఆశలు పెట్టుకున్న వినాయక్

VV Vinayak - బెల్లంకొండ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాపై వీవీ వినాయక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. దీనికి ఓ కారణం ఉంది

VV Vinayak - బెల్లంకొండపై భారీ ఆశలు పెట్టుకున్న వినాయక్
X

వీవీ వినాయక్.. టాలీవుడ్ టాప్ డైరక్టర్. అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం ఈ దర్శకుడికి అవకాశాల్లేవ్. కొన్ని అవకాశాల్ని స్వచ్ఛందంగా అతడే తిరస్కరిస్తున్నాడు. తన స్థాయికి తగ్గ సినిమా చేయలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా బాలీవుడ్ అవకాశం అందుకున్నాడు వినాయక్

ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు వినాయక్. బెల్లంకొడం సాయిశ్రీనివాస్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు అదే హీరోను బాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. అదే టైమ్ లో ఛత్రపతి రీమేక్ తో హిందీలో తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నాడు.

బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా హిట్టయితే బెల్లంకొండకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా సక్సెస్ అయితే వినాయక్ కు కూడా లాభం. ఎందుకంటే, బాలీవుడ్ హీరోలు ఎప్పుడూ రీమేక్స్ వెంట పడుతుంటారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుర్ర హీరోల వరకు చాలామందికి సౌత్ రీమేక్స్ అంటే ఇష్టం.

రీమేక్ తో ఓ డైరక్టర్ హిట్ కొడితే చాలు, అతడికి వరుసపెట్టి అవకాశాలివ్వడానికి బాలీవుడ్ హీరోలు రెడీ. రీమేక్ కాబట్టి, ఇటు వినాయక్ కు కూడా కథలతో ఇబ్బంది ఉండదు. సో.. ఛత్రపతి హిట్టయితే, సక్సెస్ ఫుల్ రీమేక్ డైరక్టర్ గా బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని చూస్తున్నాడు వినాయక్.

First Published:  10 May 2023 12:43 PM IST
Next Story