Telugu Global
Cinema & Entertainment

Viswambhara | చిరు సినిమా షూటింగ్ అప్ డేట్స్

Viswambhara Shooting Updates - చిరంజీవి హీరోగా తెరకెక్కుతోంది విశ్వంభర మూవీ. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ మొదలైంది.

Viswambhara | చిరు సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా సాగుతున్నాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షెడ్యూల్ ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజువల్ వండర్ గా ఉండబోతోంది. తన సృజనాత్మకతతో, ఈ సినిమాకు అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్ జోడిస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ.

ఈ ఇంటెన్స్ క్లైమాక్స్‌ కి ఇండియన్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు యాక్షన్ డిజైన్ చేస్తున్నాడు. చిరంజీవి సినిమాకు వర్క్ చేయడం ఇతడికి ఇదే తొలిసారి.

క్లైమాక్స్ కోసం భారీ సెట్ వేశారు. ఇలాంటి సెట్స్ ను మరో 2 నిర్మిస్తారట. ఇవన్నీ క్లయిమాక్స్ కోసమే అని టాక్. ఈ క్లైమాక్స్ లో చిరంజీవి విశ్వరూపం చూస్తారట.

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న విశ్వంభర లో త్రిష, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ అవుతుంది.

First Published:  4 Aug 2024 3:37 PM GMT
Next Story