Telugu Global
Cinema & Entertainment

Vishwambhara | చిరంజీవి సినిమా డబ్బింగ్ ప్రారంభం

Vishwambhara - చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.

Vishwambhara | చిరంజీవి సినిమా డబ్బింగ్ ప్రారంభం
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషియో-ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు.

ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉండబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. అందుకే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్ సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల కంపోజిషన్ పూర్తయింది. విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుంది.

First Published:  5 July 2024 2:31 PM GMT
Next Story