Telugu Global
Cinema & Entertainment

Mechanic Rocky | ట్రయాంగిల్ లవ్ తో వస్తున్న రాకీ

Mechanic Rocky - విశ్వక్ సేన్ తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నాడు విశ్వక్.

Mechanic Rocky | ట్రయాంగిల్ లవ్ తో వస్తున్న రాకీ
X

హీరో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’గా ఆలరించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ లాంచ్ చేశారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లవ్ ట్రయాంగిల్‌ను ప్రజెంట్ చేస్తూ.. సినిమాలోని కీలక పాత్రలను రివిల్ చేసేలా ఫస్ట్ గేర్ డిజైన్ చేశారు. ఈ గ్లింప్స్ కు జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

గ్లింప్స్ లో మెకానిక్ రాకీ గా విశ్వక్ సేన్ మ్యాసీవ్, ఇంటెన్స్ గా కనిపించాడు. విశ్వక్ సేన్ ఓ డైలాగ్ కూడా చెప్పాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “డేంజర్ కే లైసెన్సు వీడు” అనే డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా ఉంది.

గ్లింప్స్ లో మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ గా, శ్రద్ధా శ్రీనాధ్ మోడ్రన్ గా కనిపిస్తున్నారు. హీరోహీరోయిన్లతో పాటు సునీల్, నరేష్ లాంటి కీలక పాత్రల్ని కూడా చూపించారు.

ఈ సినిమాను బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెప్పుకొస్తున్నాడు విశ్వక్ సేన్. అదే టైమ్ లో మంచి యాక్షన్ కూడా ఉందంటున్నాడు. సినిమాలో కారు మెకానిక్ పాత్ర పోషించాడు ఈ హీరో.

First Published:  28 July 2024 5:05 PM GMT
Next Story