Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | ఈ హీరో సినిమాలు ఆసక్తికరం

Vishwak Sen - ఇంట్రెస్టింగ్ లైనప్ సెట్ చేసుకున్నాడు విశ్వక్ సేన్. ఓ సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా పాత్రలు ఎంచుకుంటున్నాడు.

Vishwak Sen | ఈ హీరో సినిమాలు ఆసక్తికరం
X

అవకాశాలు అందరికీ వస్తాయి. కానీ ఎలాంటి కథలు ఎంచుకుంటున్నామనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో విశ్వక్ సేన్ తన విలక్షణత చూపిస్తున్నాడు. తన అప్ కమింగ్ సినిమాలు బయటపెట్టిన ఈ హీరో, ప్రతి సినిమాతో ఓ కొత్తదనం చూపిస్తున్నాడు.

ప్రస్తుతం గామి సినిమాను విడుదల చేశాడు విశ్వక్. ఇందులో అతడు అఘోరాగా కనిపిస్తున్నాడు. అంతకుమించి ఈ సినిమా ఉంటుందని చెబుతున్నాడు. తాజాగా విడుదల చేసిన మేకింగ్ చూస్తే, ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.

ఈ మూవీ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలవుతుంది. ఈ సినిమాలో చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తిగా కనిపిస్తాడు విశ్వక్. ఈ సినిమాతో పాటు మెకానిక్ రాకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మీసాల్లేకుండా కనిపిస్తాడు, పాత్ర కూడా ఎంతో కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు.

ఇప్పటివరకు ప్రకటించని మరో చిత్రం లైలా. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ విశ్వక్ చేస్తున్న సినిమా ఇది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీ తన కెరీర్ లో కల్ట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నాడు. ఇందులో లైలా పాత్రధారి తనే అని చెబుతున్నాడు.

ఇలా డిఫరెంట్ మూవీస్ తో కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు ఈ హీరో. అన్నట్టు ఈ హీరో కెరీర్ లో కల్ట్ అనే మరో సినిమా కూడా ఉంది. కాకపోతే ఈ సినిమాలో విశ్వక్ నటించడం లేదు, కథ మాత్రం అతడిదే. ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది కూడా డిఫరెంట్ సినిమానే.

First Published:  8 Feb 2024 5:02 PM
Next Story