Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | మరో సినిమా ప్రకటించిన విశ్వక్

Vishwak Sen - వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు విశ్వక్. తాజాగా జాతిరత్నాలు దర్శకుడితో సినిమా ప్రకటించాడు.

Vishwak Sen | మరో సినిమా ప్రకటించిన విశ్వక్
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. మొన్నటికిమొన్న తన 13వ చిత్రాన్ని ప్రకటించిన ఈ నటుడు, 2 రోజుల గ్యాప్ లోనే 14వ చిత్రాన్ని కూడా ఎనౌన్స్ చేశాడు. ఈరోజు విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం కురిపించబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు.

హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో ఆదరగొట్టే విశ్వక్ సేన్ ను ఈసారి హిలేరియస్ పాత్రలో చూపించడానికి రెడీ అవుతున్నాడు అనుదీప్ కేవీ. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కెవి అనుదీప్‌తో పాటు మోహన్ కథను అందించారు.

First Published:  7 Aug 2024 4:49 PM GMT
Next Story