Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | మళ్లీ రూరల్ యాక్షన్

Vishwak Sen - రూరల్ యాక్షన్ జానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇదివరకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాడు.

Vishwak Sen | మళ్లీ రూరల్ యాక్షన్
X

జానర్ రిపీట్ చేయడానికి ఇష్టపడడు విశ్వక్ సేన్. తను చేసే సినిమాలు ముందుగా తనకు కొత్తగా ఉండాలని, ఆ తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అందుకే సినిమా సినిమాకు సంబంధం లేని కథలు ఎంచుకుంటూ ఉంటాడు. అయితే విశ్వక్ సేన్ నుంచి ఒకే జానర్ లో 2 సినిమాలున్నాయి.

రూరల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఇదివరకే విశ్వక్ సేన్ ఓ సినిమా చేశాడు. అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా అతడికి ఏమాత్రం కలిసిరాలేదు. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి అదే బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు విశ్వక్. రూరల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో శ్రీధర్ గంటాను పరిచయం చేస్తూ ఓ సినిమాను ప్రారంభించాడు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

అయితే ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. ఇందులో విశ్వక్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఇందులో అతడు ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కథ కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ఈ మూవీ కోసం కన్నడ నటి సంపదను హీరోయిన్ గా తీసుకున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  17 Aug 2024 4:38 PM GMT
Next Story