Telugu Global
Cinema & Entertainment

Matti Kusthi: విష్ణు విశాల్ సినిమా నుంచి వరుస అప్ డేట్స్

విష్ణు విశాల్ హీరోగా రవితేజ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా మట్టి కుస్తీ. ఈ స్పోర్ట్స్ డ్రామాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Matti Kusthi: విష్ణు విశాల్ సినిమా నుంచి వరుస అప్ డేట్స్
X

విశాల్ హీరోగా, చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై హీరో రవితేజతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'ఎఫ్‌ఐఆర్' తర్వాత రవితేజతో విష్ణు విశాల్‌కి ఇది రెండో బ్యాక్ టు బ్యాక్ అసోసియేషన్. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

మేకర్స్ తాజాగా సినిమా విడుదల తేదిని ప్రకటించారు. 'మట్టి కుస్తీ' డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఐశ్వర్య కుర్చీపై కూర్చుని ఉండగా, విష్ణు విశాల్ ఆమె వెనుక సీరియస్ గా నిలబడి ఉన్నాడు. ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ సినిమాలోని యాక్షన్, రొమాంటిక్ సైడ్స్ చూపించారు. రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు.

హై యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో విష్ణు విశాల్ రెజ్లర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు. డిసెంబర్ 2న హిట్-2 సినిమా కూడా వస్తోంది. అలా అడివి శేష్ సినిమాతో విష్ణు విశాల్ పోటీపడబోతున్నాడు.

First Published:  12 Nov 2022 3:47 AM GMT
Next Story