Telugu Global
Cinema & Entertainment

Vishnu Vishal: మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..?

రవితేజ నిర్మిస్తున్న సినిమా మట్టి కుస్తీ. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది.

Vishnu Vishal: మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే..?
X

హీరోలు రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఆర్‌ టి టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ లపై రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తుండగా.. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. రవితేజ చేతుల మీదుగా విడుదలైన ఈ పోస్టర్‌లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్‌గా రింగ్‌లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించాడు. రెజ్లింగ్ డ్రెస్ లో, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్నాడు విష్ణు విశాల్.

మట్టి కుస్తీ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.

మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.




First Published:  3 Nov 2022 6:30 AM GMT
Next Story