Telugu Global
Cinema & Entertainment

Matti Kusthi: భార్యాభర్తల బంధమే మట్టి కుస్తీ

Matti Kusthi Movie: విడుదలకు ముందే మట్టి కుస్తీ సినిమా స్టోరీలైన్ చెప్పేశాడు హీరో విష్ణు విశాల్. సినిమా స్పోర్ట్స్ జానర్ కాదంటున్నాడు.

Matti Kusthi: భార్యాభర్తల బంధమే మట్టి కుస్తీ
X

మట్టి కుస్తీ.. ఈ టైటిల్ చూసి చాలామంది ఇది క్రీడానేపథ్యం ఉన్న సినిమా అనుకుంటున్నారు. కుస్తీ పోటీల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఫిక్స్ అయిపోయారు. అయితే అలాంటిదేం లేదంటున్నాడు హీరో విష్ణు విశాల్. కుస్తీ అనేది కేవలం ఓ ఎలిమెంట్ మాత్రమేనని, మట్టి కుస్తీ సినిమా ప్రధానంగా భార్యాభర్తల బంధం గురించి చాటిచెబుతుందని చెబుతున్నాడు.

"మట్టి కుస్తీ భార్యాభర్తల ప్రేమ కథ. భార్యాభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ పోటీ కూడా భాగంగా ఉంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే ఆట ఉంది.. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యాభర్తలకు కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలౌతాయి. మట్టికుస్తీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. స్పోర్ట్స్ కూడా లైట్ హార్టెడ్ గా ఉంటుంది. సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. మట్టి కుస్తీ సినిమా, నా కెరీర్ లో మొదటి అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మసాల ఫిల్మ్."

ఇలా మట్టి కుస్తీ సినిమా క్రీడానేపథ్యంతో సాగే మూవీ కాదని స్పష్టం చేశాడు విష్ణువిశాల్. 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో చల్లా అయ్యావు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరో రవితేజ ఈ సినిమాకు నిర్మాత.

First Published:  27 Nov 2022 11:32 AM GMT
Next Story