Telugu Global
Cinema & Entertainment

Ratnam Movie | రత్నం ట్రయిలర్ అదిరింది

Ratnam Movie - విశాల్ తాజా చిత్రం రత్నం. ఈ సినిమా నుంచి ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం.

Ratnam Movie | రత్నం ట్రయిలర్ అదిరింది
X

మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించాయి. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్ సంయుక్తంగా ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. రత్నం ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ,తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా ఈ కథ నడిచిందని అర్థమౌతుంది. ఇక హీరోయిన్ కోసం హీరో చేస్తున్న ఊచకోతను చూస్తుంటే మాస్ యాక్షన్ జానర్ ను ఇష్టపడే ఆడియెన్స్‌కు పండుగలానే కనిపిస్తోంది.

ఇక ఈ ట్రైలర్‌కు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు.

కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా వ్యవహరించాడు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

First Published:  17 April 2024 8:14 AM IST
Next Story