Vinaro Bhagyamu Vishnu Katha: ఒక రోజు ఆలస్యంగా కిరణ్ అబ్బవరం సినిమా
Vinaro Bhagyamu Vishnu Katha - కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతోంది.

జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాత. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రమిది.
ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. 'నెంబర్ నైబరింగ్' కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న థియేటర్స్ లో భారీగా విడుదల కాబోతుంది.
నిజానికి ఈ సినిమాను 17వ తేదీ శుక్రవారం విడుదల చేయాలనుకున్నారు. కానీ ధనుష్ హీరోగా నటిస్తున్న సర్ సినిమాకు సోలో రిలీజ్ ఇవ్వడం కోసం కిరణ్ అబ్బవరం సినిమాను ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో కశ్మీరా హీరోయిన్ గా నటిస్తుండగా, మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.