Telugu Global
Cinema & Entertainment

Aparichithudu | విక్రమ్ సినిమా రీ-రిలీజ్

Vikram's Aparichithudu - విక్రమ్ కు దేశవ్యాప్తంగా ఎనలేని పేరు తెచ్చిపెట్టిన సినిమా అపరిచితుడు. ఇప్పుడీ సినిమా రీ-రిలీజ్ అవుతోంది.

Aparichithudu | విక్రమ్ సినిమా రీ-రిలీజ్
X

శంకర్ తీసిన అన్నియన్ (2005) సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం, ఇందులో విక్రమ్, సదా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచింది. ఆ తర్వాత ఈ చిత్రం, 'అపరిచితుడు' పేరుతో తెలుగులో విడుదలైంది. టాలీవుడ్ లో కూడా పెద్ద హిట్టయింది.

ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్‌కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టింది . టెలివిజన్‌లో కూడా, అపరిచితుడు అప్పటి నుండి ఇప్పటివరకు అద్భుతమైన రేటింగ్స్ సాధిస్తూనే ఉంది.

ఇప్పుడీ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. తెలుగులో ఈ శుక్రవారం రీ-రిలీజ్ కాబోతోంది. తెలుగులో చెప్పుకోదగ్గ రిలీజెస్ లేవు. ఓవైపు ఎన్నికల ఫీవర్, మరోవైపు ఐపీఎల్, ఇంకోవైపు మండే ఎండలు.. ఫలితంగా థియేటర్లు ఖాళీ అయ్యాయి.

అపరిచితుడు సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు ఇది సరైన సమయం. హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమాను రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయబోతున్నాడు శంకర్.

First Published:  15 May 2024 5:48 PM GMT
Next Story