Telugu Global
Cinema & Entertainment

Vikram Kumar | దూతలో గెటప్ వెనక చైతూ హస్తం

Nagachaitanya - దూత సినిమాలో నాగచైతన్య లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఈ లుక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు దర్శకుడు విక్రమ్ కుమార్.

Vikram Kumar | దూతలో గెటప్ వెనక చైతూ హస్తం
X

నాగచైతన్య హీరోగా నటించిన వెబ్ సిరీస్ దూత. విక్రమ్ కుమార్ డైరక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో కొత్తగా కనిపించాడు నాగచైతన్య. ఆ గెటప్ వెనక హోం వర్క్ మొత్తం చైతూదేనని స్పష్టం చేశాడు దర్శకుడు.

"దూతకి ముందు ఆయన ‘థాంక్ యు ‘సినిమా చేశారు. అందులో గడ్డం ఉంటుంది. అంతకుముందు చేసిన సినిమా లవ్ స్టొరీలో కూడా గడ్డంతో కనిపించాడు. తను గడ్డంలో చాలా అందంగా కనిపిస్తాడు. నాకు కూడా చైతుని గడ్డం లుక్ లోనే చూడటం ఇష్టం. అయితే దూతకి వచ్చేసరికి కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం అన్నాడు. క్లీన్ షేవ్ లో కనిపిస్తా.. ఎలా ఉంటుందో చూడు అన్నాడు. అలా ఒక ఫోటో పంపించాడు. క్లీన్ షేవ్, మీసంలో చాలా అద్భుతంగా కనిపించాడు. అదే లుక్ ని ఫిక్స్ అయ్యాం."

దూత వెబ్ సిరీస్ చాలా ఆలస్యమైంది. దీనిపై కూడా స్పందించాడు దర్శకుడు. సిరీస్ ఆలస్యమైందని అంగీకరిస్తూనే, దానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయంటున్నాడు.

"షూటింగ్ త్వరగానే పూర్తి చేశాం. అయితే చాలా హెవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. వెబ్ సిరిస్ లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకుడిని షోలో కూర్చోబెట్టాలంటే టెక్నికల్ వర్క్ చాలా బ్రిలియంట్ గా ఉండాలి. 8 ఎపిసోడ్స్ లో యంగేజ్ చేయాలంటే ఎడిటింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని కోసం కావాల్సిన సమయం తీసుకున్నాం. నవీన్ అద్భుతంగా ఎడిట్ చేశారు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇక వెబ్ సిరిస్ అంటే ఓటీటీ సంస్థలకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. క్యాలిటీ చెక్స్ ఉంటాయి. వాటికి సహజంగానే కాస్త సమయం పడుతుంది."

1వ తేదీన స్ట్రీమింగ్ కు వస్తోంది దూత సిరీస్. నాగచైతన్య కెరీర్ లో తొలి వెబ్ సిరీస్ ఇది. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కు రాబోతోంది.

First Published:  29 Nov 2023 10:53 PM IST
Next Story