Telugu Global
Cinema & Entertainment

GOAT Movie | విజయ్ సినిమా నుంచి స్పార్క్ సాంగ్ రిలీజ్

GOAT Movie - విజయ్ తాజా చిత్రం గోట్. ఈ సినిమా నుంచి ఇంకో సాంగ్ రిలీజైంది.

GOAT Movie | విజయ్ సినిమా నుంచి స్పార్క్ సాంగ్ రిలీజ్
X

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే 2 పాటలు రిలీజయ్యాయి. తాజాగా మరో సాంగ్ విడుదల చేశారు.

ఈ రోజు మేకర్స్ స్పార్క్ సాంగ్ ని రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటని కంపోజ్ చేయడంతో పాటు ఆలపించాడు కూడా. తెలుగులో ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. యువన్ శంకర్ రాజా, వృష బాలు కలిసి పాడారు. ఈ సాంగ్ లో విజయ్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. విజయ్, మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ బాగుంది.

విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయబోతోంది.

First Published:  3 Aug 2024 10:02 PM IST
Next Story