Telugu Global
Cinema & Entertainment

Allari Naresh - నా మైనస్ పాయింట్స్ అతడికి తెలుసు

Allari Naresh - తన మైనస్ పాయింట్స్ ఏంటో దర్శకుడు విజయ్ కనకమేడలకు బాగా తెలుసంటున్నాడు హీరో అల్లరి నరేష్.

Allari Naresh - నా మైనస్ పాయింట్స్ అతడికి తెలుసు
X

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ఉగ్రం సినిమా. అల్లరి నరేష్ నటించిన మరో సీరియస్ మూవీ ఇది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. దర్శకుడు నమ్మితే సినిమా హిట్టవుతుందని చెబుతున్నాడు అల్లరోడు. పైగా తన మైనస్ పాయింట్స్ ఏంటో ఉగ్రం దర్శకుడు విజయ్ కనకమేడలకు తెలుసంటున్నాడు.

"దర్శకుడు విజయ్ నా ప్లస్సుల కంటే మైనస్సులు ముందుగా చెప్పేశాడు. పోలీస్ పాత్రకు నా ఎత్తు పొడుగు ఓకే. అయితే నా కంటే ఎత్తు తక్కువ వున్న వాళ్ళతో చేసినప్పుడు నేను ఒంగి మాట్లాడతానని, వరుసగా కామెడీ సినిమాలు చేయడం వలన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే అటు వైపు వెళుతుందని, పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారని,.. వీటన్నిటిని అధిగమించాలని ముందే వివరంగా చెప్పాడు. చాలా జాగ్రత్తలు తీసుకొని, కంట్రోల్ చేసి ఉగ్రం చేశాను. క్రిష్ నమ్మకంతో గమ్యం వచ్చింది. సముద్రఖని నమ్మకంతో శంభో శివ శంభో వచ్చింది. ఇప్పుడు విజయ్ నమ్మకంతో నాంది, ఉగ్రం వచ్చాయి. దర్శకుడు నమ్మితే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది."

ఇలా తన వీక్ నెస్ లు బయటపెట్టాడు అల్లరి నరేష్. కామెడీ చేసినోళ్లు ఏదైనా చేయగలరని అంటున్నాడు ఈ నటుడు. రంగమార్తాండ లో బ్రహ్మనందం, విడుదల పార్ట్-1లో సూరి అద్భుతంగా చేశారని, ఇప్పుడు ట్రెండ్ మారుతోందని చెబుతున్నాడు.

First Published:  3 May 2023 10:57 PM IST
Next Story