Vijay Deverakonda | దేవరకొండ ఫ్యాన్స్ ఎదురుచూపు
Vijay Deverakonda - విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీస్టార్. ఇప్పుడీ మూవీ బుల్లితెరపైకి రాబోతోంది.

ఫ్యామిలీ స్టార్ అట్టర్ ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో ఫ్లాప్ చేరింది. మరి దీన్ని కవర్ చేసుకోవడం ఎలా? ప్రస్తుతం ఒకే ఒక్క అవకాశం అందుబాటులో ఉంది. ఈ సినిమా త్వరలోనే బుల్లితెరపైకి రాబోతోంది. రేటింగ్ లో ఇది సూపర్ హిట్ కొడితే, కవర్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఒక అవకాశం దొరుకుతుంది.
పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ స్టార్ తీసినట్టు ప్రకటించాడు నిర్మాత దిల్ రాజు. కానీ అదే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమయ్యారు. ఇప్పుడు టీవీల్లోకి రాబోతున్న ఈ ఫ్యామిలీ స్టార్ ను, కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది పెద్ద ప్రశ్న.
స్టార్ మా ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు సినిమాను ప్రసారం చేయబోతోంది. కనీసం టీవీల్లోనైనా ఈ సినిమా హిట్టయితే పండగ చేసుకోవాలని చూస్తున్నారు దేవరకొండ ఫ్యాన్స్.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా కొలిక్కి వచ్చిన వెంటనే రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు.