Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda | దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా

Vijay Deverakonda - మొన్ననే దిల్ రాజుతో కలిసి ఫ్యామిలీ మేన్ సినిమా చేశాడు. త్వరలోనే రాజుతో ఇంకో సినిమా చేయబోతున్నాడు.

Vijay Deverakonda | దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా
X

గీత గోవిందం తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మళ్లీ ఆ స్థాయిలో హిట్ కొట్టలేదు. వంద కోట్ల సినిమా కొడతానని చెప్పిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. అతని తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్ భారీ విమర్శలు మూటగట్టుకుంది. అలా భారీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది.

ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో తన నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ తర్వాత అతడు మరోసారి దిల్ రాజు బ్యానర్ లో నటించబోతున్నాడు. విజయ్ దేవరకొండ రూరల్ యాక్షన్ డ్రామా కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో చేతులు కలిపాడు. రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ యువ దర్శకుడు అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశాడు.

విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంది. శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ రూరల్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ ను ఈ నెల 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజున సందర్భంగా బయటపెడతారు.

కెరీర్ లో దిల్ రాజుకు ఇది 59వ చిత్రం. ఈ సినిమా కంటే ముందు అతడు, విజయ్ దేవరకొండతో మరో పెద్ద సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి, రవికిరణ్ కోలా ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నారు.

First Published:  4 May 2024 7:56 AM
Next Story