Vijay deverakonda | తండ్రి పేరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ
Vijay deverakonda - ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు హీరో విజయ్ దేవరకొండ.
హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమా మరో 4 రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమా హైలైట్స్ వివరించారు.
"మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్ లోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుంది. ఆయన ఎలా ఫ్యామిలీ కోసం పనిచేసేవారో గుర్తుకు వస్తుంటుంది."
ఇలా సినిమాలో తన పాత్ర పేరుతోపాటు... ఆ క్యారెక్టర్ కు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు విజయ్ దేవరకొండ. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తోంది. అదే రోజు దిల్ రాజు నిర్మించిన దిల్ రిలీజైన రోజు. దిల్ రాజుకు దిల్ అనే బిరుదు వచ్చిన రోజు. ఇక ఏప్రిల్ 8న విజయ్ దేవరకొండ తండ్రి బర్త్ డే. ఇలా అందరికీ ఈ సినిమాతో ఓ అనుబంధం ఏర్పడింది.