Telugu Global
Cinema & Entertainment

Vijay Deverakonda: హరీశ్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది.

Vijay Deverakonda: హరీశ్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
X

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే కొన్ని షెడ్యుల్స్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సమంత ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో, షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ లో ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు విజయ్.


హరీష్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్. ఈమధ్య విజయ్ ను కలిసి హరీష్ ఓ స్క్రిప్ట్ వినిపించాడని విజయ్ కి పాయింట్ నచ్చిందని తెలుస్తుంది. వీరిద్దరి ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా ఫైనల్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత ఈ కాంబో సినిమా ఓ కొలిక్కి వస్తుందని సమాచారం.


పవన్ కళ్యాణ్ తో హరీష్ చేయాల్సిన 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ఆగిపోయింది. దీంతో హరీశ్ శంకర్ ఇతర హీరోల వైపు చూస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే రామ్ పోతినేనికి ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు విజయ్ దేవరకొండపై కూడా ఫోకస్ పెట్టాడు.

First Published:  9 Nov 2022 6:47 PM IST
Next Story