Telugu Global
Cinema & Entertainment

ప్రేమపై 'లైగ‌ర్' సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. డాడీ ఏం చెప్పారంటే..!?

ఈ ప్రపంచం అంతా డ‌బ్బు చుట్టూనే తిరుగుతుంద‌ని , ప్రేమ..గీమా అన్నీ బుల్ షిట్ అని మా నాన్న చెప్పి.. అలా జాగ్ర‌త్త‌గా ఉండేలా నేర్పించారు. ఇది నాలో చాలా బలంగా నాటుకుపోయింది, నేను పెద్దయ్యాక, ఈ సంబంధాలపై నమ్మకం పెట్టుకోలేదు.

ప్రేమపై లైగ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. డాడీ ఏం చెప్పారంటే..!?
X

టాలివుడ్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయిలో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా `లైగ‌ర్` సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా రేపు (25న‌) విడుద‌ల‌వుతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా కొన్ని చోట్ల విజ‌య్ వివాదాలు, విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. తాజాగా ' లైగ‌ర్` సినిమాను బాయ్ కాట్ చేయండంటూ' నెటిజ‌న్లు ట్రెండ్ చేశారు. దీనిపై విజ‌య్ స్పందిస్తూ..త‌న‌కు దేవుడిపై విశ్వాసం ఉంద‌ని, త‌న త‌ల్లి ఆశీస్సులు త‌న‌కు ఉన్నాయ‌ని, `లైగ‌ర్` మూవీ బాక్సాఫీస్ వద్ద రాక్ చేస్తుందని విశ్వాసం వ్య‌క్తం చేశారు. కాగా అతని వృత్తి జీవితంతో పాటు, విజయ్ వ్యక్తిగత జీవితంపై కూడా సినీ అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. తన డేటింగ్ జీవితం గురించి ఎప్పుడూ పెదవి విప్పని అర్జున్ రెడ్డి స్టార్, ఇటీవల ప్రేమ, సంబంధాలపై తన అభిప్రాయాలు చెబుతూ.. `లైగ‌ర్` సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాడు.

ప్రేమ అంటే త‌న‌కు ఎంతో విశ్వాసం ఉంద‌ని, అదే స‌మ‌యంలో దాని వ‌ల్ల హృద‌యం ముక్క‌ల‌య్యే ప్ర‌మాదం ఉంద‌నే భ‌యం కూడా ఉంద‌ని విజ‌య్ చెప్పాడు. ఎవ‌రో 'ల‌వ్యూ' అంటూ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తే తాను స్పందిస్తూ నేను కూడా ' ఐ ల‌వ్యూ టూ' అంటూ చెప్ప‌లేన‌ని, చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఓ ఆంగ్ల వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ, "నేను ప్రేమలో ఉండటాన్ని ఇష్టపడే వ్యక్తిని. నేను ప్రేమకథలను నమ్ముతాను. నాకు అవి సంతోషం క‌లిగిస్తాయి. కానీ అవి విక‌టించి హృద‌యం గాయ‌ప‌డి భ‌గ్న‌మ‌వుతాయ‌నే భ‌యం కూడా ఉంది. అయితే ఇప్పటివరకు, అది జరగలేద‌నుకోండి.." అని వివరించాడు విజయ్ దేవరకొండ. తనకు ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితి ఎదురు కానప్పటికీ, తన తండ్రి ఇచ్చిన కొన్ని సలహాల వల్ల ఇతరులు త‌న‌తో స‌న్నిహితంగా మెలిగే ప్ర‌య‌త్నాల‌ను దూరం పెట్ట‌డంతో కొంత‌మంది మ‌న‌సుల‌ను క‌ష్టపెట్టాన‌ని అన్నాడు.

" ఈ ప్రపంచం అంతా డ‌బ్బు చుట్టూనే తిరుగుతుంద‌ని , ప్రేమ..గీమా అన్నీ బుల్ షిట్ అని మా నాన్న చెప్పి.. అలా జాగ్ర‌త్త‌గా ఉండేలా నేర్పించారు. ఇది నాలో చాలా బలంగా నాటుకుపోయింది, నేను పెద్దయ్యాక, ఈ సంబంధాలపై నమ్మకం పెట్టుకోలేదు. నా దగ్గరకు ఎవరు వచ్చినా, కోరికతోనే వచ్చారని నేను నమ్మడం మొదలుపెట్టాను.. ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారని చెప్పినప్పుడు, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను( ఐ ల‌వ్యూ టూ) అని నేను ఎప్పుడూ చెప్పలేదు, ఈ రోజు వరకు అది జ‌ర‌గ‌లేదు." అని విజ‌య్ చెప్పారు.

ఆమె ప‌రిచ‌యంతో మారిపోయాను..

అయితే ఇప్పుడు ప్రేమానుబంధాల‌పై త‌న మ‌న‌సును మార్చుకున్నాన‌ని విజ‌య్ చెప్పాడు. తాను నటుడిగా మారిన తర్వాత ఓ మహిళతో 'లాంగ్ రిలేషన్‌షిప్' లో ఉన్న తర్వాత ప్రేమ భావనపై తన దృక్పథం మారిపోయిందని వెల్లడించాడు. అయితే ఆ మహిళ పేరు మాత్రం చెప్పేందుకు నిరాకరించాడు. పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరు తమ రిలేషన్‌షిప్ గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ గా వ‌స్తున్న `లైగ‌ర్` సినిమాలో విజయ్ ఎంఎంఎ ఫైటర్ బాక్సర్‌గా, అనన్య పాండే జోడీగా, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించ‌నున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రీమియర్‌గా వస్తోంది.

First Published:  24 Aug 2022 11:30 PM IST
Next Story