కొండా సురేఖ కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ ఫైర్
టాలీవుడ్ నటి సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను హీరో విజయ్ దేవరకొండ తీవ్రంగా ఖండించారు.

నటి సమంత డివోర్స్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తీవ్రంగా ఖండించారు.ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రవర్తనకు సంబంధించి.. నా ఆలోచనలను అలాగే నా భావాలను మంచిగా చెప్పడానికి చాలా కష్టపడుతున్నాను. ప్రస్తుత రాజకీయ నాయకులు ఒకటే గుర్తుచేయాలి అనుకుంటున్నా.మేము మీకు ఓటేసేది మమ్మల్ని బాగా చూసుకుంటారని, అభివృద్ధి చేస్తారని పెట్టుబడులు తెస్తారని, ఉద్యోగాలు ఇస్తారని, ఆరోగ్యం, విద్య, ఇతర సౌకర్యాల గురించి మాట్లాడతారని.. ప్రజలుగా ఇలాంటివి ఇక ఏమాత్రం సహించం.
రాజకీయాలు ఇంతకంటే ఇక దిగజారోద్దు. ఇక చాలు అంటూ విజయ్ దేవరకొండ రాసుకోచ్చాడు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు ఇండస్ట్రీలో దూమారం రేపుతుంది. కొండా సురేఖ మాట్లాడిన తీరు పట్ల యావత్ సమాజం వ్యతిరేకిస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.