Telugu Global
Cinema & Entertainment

Toofan Movie | విజయ్ ఆంటోనీ సినిమా వచ్చేస్తోంది

Toofan Movie - విజయ్ ఆంటోనీ మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. సినిమా పేరు తూఫాన్.

Toofan Movie | విజయ్ ఆంటోనీ సినిమా వచ్చేస్తోంది
X

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది.

పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు.

తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. "తుఫాన్" సినిమా నుంచి ఇప్పటికే ట్రయిలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.

మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ కలిసి ఈ సినిమాకు సంగీతం అందించారు.

First Published:  12 July 2024 8:33 AM GMT
Next Story